విద్యార్థులు కలలు కనడం మానేయాలి! : ఇళయరాజా
![]() |
| ilayaraja |
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఇళయరాజాను కొన్ని ప్రశ్నలు అడుగగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోందని మరీ మీ బయోపిక్ గురించి ఏమంటారు అని పలువురు విద్యార్థులు ఆయనను అడుగారు. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రస్తుతం తాను తన స్వీయచరిత్రను రాస్తున్నానని చెప్పారు. త్వరలో ఆ పుస్తకాన్ని ప్రచురిస్తా అంటూ సమాధానం ఇచ్చారు. ఎవరైనా తన బయోపిక్ తీయాలంటే అభ్యంతరం లేదన్నారు. తన బయోపిక్ కేవలం మూడురోజుల్లో పూర్తవుతుందని చమత్కరించారు. ఈ బయోపిక్ లో తనను నటించమంటే నటించడానికి తనకేలాంటి అభ్యంతరం లేదని ఆయన విద్యార్థులకు జవాబిచ్చారు. ఇప్పటి వరకు ఇళయరాజా సంగీతాన్నే చూశాం.. ఇక ఆయన బయోపిక్ ద్వారా ఆయన నటనను కూడా చూసే అవకాశం ఆయన అభిమానులకు దక్కనుంది. సో ఆయన బయోపిక్ త్వరలోనే రావాలని ఆశిద్దాం..
ilayaraja
Reviewed by Tollywood
on
March 27, 2019
Rating:
Reviewed by Tollywood
on
March 27, 2019
Rating:

No comments: