Sidebar Ads

banner image
banner image

hot coffee


వేడివేడీ కాఫీ, టీ తాగేవారికి షాకింగ్ న్యూస్!


hot coffee

ఉదయాన్నే వేడివేడి కాఫీ, టీ తాగకుండా ఉండలేక పోతున్నారా? అయితే మీరు ఇది తప్పకుండా చదవాల్సిందే.. కాఫీ, టీలతో రోజును ప్రారంభించని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. చాలామంది వేడివేడి కాఫీ, టీలనే తాగడానికి ఇష్టపడుతుంటారు. వేడిగా లేకుంటే వారికి టీ లేదా కాఫీ తాగినట్టు అనిపించదు. అలాంటి వారిపై అమెరికన్ కేన్సర్ సొసైటీ అధ్యాయనం చేసి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించింది.

అదేంటంటే వేడివేడి కాఫీ, టీ తాగడం వల్ల జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉందని అమెరికన్ కేన్సర్ సొసైటీ తాజాగా వెల్లడించింది. 40 నుంచి 75ఏళ్ల వయస్సు కలిగిన 50వేల మందిపై అమెరికన్ కేన్సర్ సొసైటీ పరిశోధకులు అధ్యాయనం చేశారు. ఈ సమయంలోనే 317మంది జీర్ణకోశ వ్యాధికి గురైనట్లు గుర్తించారు. పదేళ్లపాటు వీరిపై అధ్యాయనం చేసి జీర్ణకోశ కాన్సర్ వచ్చే అవకాశం ఉందని తాజాగా వెల్లడించారు.

i love tea
అయితే ఇదంతా కూడా 60 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి ఉన్న కాఫీ, టీ తాగేవారికే వర్తిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. 60 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ వేడివున్న కాఫీ, టీలను రోజుకు 700 మిల్లీమీటర్ల మేర తాగేవారితో పొలిస్తే.. అంతకుమించి వేడితో కాఫీ, టీ తాగేవారికి జీర్ణకోశ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నట్లు వారి పరిశోధనలో వెల్లడయిందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకటించింది. ఇప్పటికే వేడివేడి కాఫీ, టీ తాగేవారే వాటిని తాగే ముందు ఉఫ్.. ఉఫ్ అని ఊది కొంచెం చల్లారకే తాగడం మంచిది. దీనివల్ల జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ముప్పును నివారించుకోవచ్చు.

hot coffee hot coffee Reviewed by Tollywood on March 22, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.