Sidebar Ads

banner image
banner image

Pregnancy control


కుటుంబ నియంత్రణ మరీ ఇంత సులువా?


రోజురోజుకు టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంది. టెక్నాలజీ మనుషుల కనీస అవసరాలను తేలికగా మార్చివేస్తోంది. వస్తువుల వినియోగంలో టెక్నాలజీ వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకు టెక్నాలజీ మరింత స్మార్ట్ గా మారుతోంది.   కుటుంబ నియంత్రణ అంటేనే భయపడే మహిళలకు తాజా పరిశోధనలో వెల్లడయిన విషయం ఒక వరంలా మారనుంది.


family control
ఇక తాజాగా కుటుంబ నియంత్రణలో కూడా టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీనివల్ల కుటుంబ నియంత్రణ మరింత సులభంగా మారనుంది.  కుటుంబ నియంత్రణలో పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు పరిశోధకులు. కేవలం మహిళలు ధరించే చెవి రింగులు, ఉంగరం, నెక్లెస్ వంటి ఆభరణాలను ధరించడం ద్వారా గర్భం రాకుండా నిరోధించే పద్ధతులను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈమేరకు అమెరికాలోని జార్జియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

wedding rings
nekles

మహిళలు ధరించే ఆభరణాల్లో గర్భనిరోధన హార్మోన్లు కలిగిన పట్టీలను అమర్చనున్నట్లు తెలిపారు. వీటిని ధరించడం వల్ల అందులోని ఉండే హార్మోన్లు చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి గర్భం రాకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతానికి అధ్యాయన దశలో ఉన్న ఈ టెక్నాలజీ రానున్న రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఇక అందుబాటులోకి వస్తే మహిళలకు కుటుంబ నియంత్రణ అవస్థలు తొలిగిపోనున్నాయి. ఇక కుటుంబ నియంత్రణ అంటే జంకే రోజులకు కాలం చెల్లినట్లే. కుటుంబ నియంత్రణను ఇంత సులువుగా మార్చివేసి మహిళల కష్టాలను దూరంచేసిన శాస్త్రవేత్తలకు హ్యట్సప్ చెప్పాలిందే మరీ..
Pregnancy control Pregnancy control Reviewed by Tollywood on March 28, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.