క్యాన్సర్ వ్యాధికి మిర్చితో చెక్!
ఊపిరితిత్తుల క్యాన్సర్ ను తగ్గించడంలో మిర్చి దివ్య ఔషధంలా పని చేస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడయింది. భారతీయులు నిత్యం కర్రీల్లో వాడే కారంతో క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చని తేలింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ను తగ్గించడంలో మిర్చి కీలకపాత్ర పోషిస్తుందని తేలింది.
 |
| red mirchi |
అమెరికాకు చెందిన మార్షల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయంపై అధ్యాయనం చేశారు. ప్రస్తుతం ఈ పరిశోధనలు తొలిదశలోనే ఉంది. ప్రస్తుతం ఎలుకలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడయింది. ఎలుకల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంబంధించిన కణాలు పెరగకుండా నివారించడంలో కారం కీలకంగా వ్యవహరించినట్లు మార్షల్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. మరిన్ని పరిశోధనలు చేసి ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నివారించే దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు.
 |
| mirchi |
అయితే ఇప్పటివరకు క్యాన్సర్ ను నివారించేందుకు సరైన మందులు లేవు. క్యాన్సర్ కణాలు ఎదుగులదలను తగ్గించడం ద్వారా క్యాన్సర్ వ్యాధిని నియంత్రించవచ్చు. ఏదిఏమైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల నివారణపై మిర్చి దివ్య ఔషధంలా పని చేస్తుందని తేలింది. త్వరలోనే క్యాన్సర్ ను నివారిస్తున్న కారంలోని గుణాలను కనిపెట్టి క్యాన్సర్ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయులు వాడే కర్రీల్లో వాడే కారంతో క్యాన్సర్ నివారించవచ్చని తేటతెల్లం కావడంతో మన పూర్వీకులకు ఎంత ముందుచూపు ఉందో ప్రస్తుత తరానికి తెలిసివచ్చేలా చేసింది. ఏదిఏమైనా మన పూర్వీకుల పద్ధతుల ముందు ఇప్పటి టెక్నాలజీ ఏమాత్రం సరితూగదని తాజా పరిశోధనతో మరోమారు తేటతెల్లమైంది.
No comments: