Sidebar Ads

banner image
banner image

ice cream

ప్రతీరోజూ ఐస్ క్రీం తింటున్నారా? అయితే ఇది చదవండి!


ఐస్ క్రీం అంటే  ఇష్టపడిన వారుండరు. చిన్నారుల నుంచి పెద్దవారి దాకా ఐస్ క్రీములను ఇష్టంగా తింటుంటారు. వయోబేధం లేకుండా  ఐస్ క్రీమును ఇష్టంగా తింటుంటారు. అయిేతే ప్రతిరోజూ ఐస్ క్రీం తింటే ఏమవుతుందని చాలామంది వీటీకి దూరంగా ఉంటుంటారు. అంతేకాదు చిన్నారులను కూడా వాటికి దూరంగా పెడుతుంటారు
.


అయితే ఇటీవల ఓ పరిశోధనలో ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా ఐస్ క్రీం తింటే రోజంతా చురుకుగా ఉంటారనే విషయం వెల్లడయిందట.  ఈ పరిశోధనలో కొందరు వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపుకు ఉదయం బ్రేక్ ఫాస్టుగా ఐస్ క్రీం ఇచ్చారు. మరి గ్రూపు వారికి వారు రోజు తినే ఆహారాన్ని బ్రేక్ ఫాస్టుగా అందించారు. వీరందరికీ ఓ ఫజిల్ ఇచ్చి పూర్తి చేయమన్నారు. వీరిలో ఉదయం బ్రేక్ ఫాస్టుగా ఐస్ క్రీం తిన్నవారు రెండో గ్రూపుతో పోల్చుకుంటే ఎంతో ఉత్సాహంగా ఫజిల్ ను పూర్తి చేశారు. సుమారు 2వేల మందిపై ఈ పరిశోధన చేశారట. అయితే ఇది ఇంకా తొలిదశలోనే ఉందట. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.


ఏదిఏమైనా ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. అతి చేస్తేనే ప్రమాదంగా మారుతుంది. కాబట్టి మీ ఆనందాలను దూరం చేసుకోకుండా సాధ్యమైనంత వరకు లిమిట్ గా ఐస్ క్రీములను తీసుకుంటే బెటారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం ఐస్ క్రీంలను తినడానికి..

ice cream ice cream Reviewed by Tollywood on March 04, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.