వేసవి కూల్ గా సాగిపోవాలంటే ఏం చేయాలి?
వేసవి రానే వచ్చేసింది. ఉదయం 7గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం సమయంలో జనం రోడ్లపైకి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. వేసవి అంటే ముందుగా గుర్తొచ్చేది వడదెబ్బ, డిహైడ్రేషన్. వీటి బారినపడకుండా ఈ సమ్మర్(summer) కూల్ గా సాగిపోవాలంటే ఈ కింద చెప్పే టిప్స్(Tips)ను పాటించండి.
చల్లటి ప్రాంతం నుంచి సడన్ గా వేడి ప్రదేశంలోకి వెళ్లడం ద్వారా శరీరం టెంపరేచర్లో మార్పు తట్టుకోలేకపోవడం చెమట వస్తుంది. అయితే చెమట వల్ల మన శరీరంలోని నీరు బయటకు వెళుతుంది. అంతేకాకుండా బాడీలోని శరీరానికి కావాల్సిన సోడియం, పోటాషియం, క్లోరైడ్, పాస్పరస్ కూడా బయటికి వెళ్లిపోతాయి. అందుకోసమే వేసవిలో శీతలపానీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.
- శరీరంలో కోల్పోయినటువంటి లవణాలన్నింటినీ రికవరీ(recovery) ఒకే ఒక పానీయం కొబ్బరి నీళ్లు(coconut water). అందుకే ఈ సమ్మర్ లో ఎక్కువగా కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఉత్తమం. అలాగే వేసవిలో దొరికే పుచ్చకాయ(water melon)ను తినడం మంచిది.
- వీలైనంత వరకు కూల్ డ్రింక్స్(cool drinks)కు దూరంగా ఉండండి. వీటికి బదులుగా చల్లటి మజ్జిగ, ఓఆర్ఎస్, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి.
- సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకండి. మధ్యాహ్నం సమయంలో పనులు ఉంటే వాయిదా వేసుకొని సాయంత్రం పనులను పూర్తి చేసుకునేలా ప్రయత్నించండి.
- నీరు ఎంత తాగితే అంత మంచిది. నార్మల్ డేస్ లో కంటే రెండు, మూడు లీటర్ల నీరు(water) ఎక్కువగా తీసుకోవాలి.
- లైట్ కలర్, లూజ్ గా ఉండే కాటన్(cotton dress) డ్రెస్సులు వేసుకోవాలి.
- తప్పనిసరిగా ఎండలో పని చేయాల్సి వస్తే తప్పనిసరిగా గొడుగు, హెల్మెట్, కూలింగ్ గ్లాసెస్(coling glass), క్యాప్(cap) వంటివి ధరించండి.
- ఎండలో బయటికి వెళ్లినపుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్(water bottle) వెంట తీసుకెళ్లండి.
- ఆయిల్ ఫుడ్స్(oil food), ఎక్కువ ప్రొటీన్లు, ఫ్రైలకు దూరంగా ఉండండి.
- కూరగాయలు, ఫ్రూట్స్ వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి.
- వేసవిలో చెమట తలకు పట్టి హెయిర్ ప్రాబ్లమ్(Hair problem) వచ్చే అవకాశం ఉంది. రోజూ చల్లని నీటితో స్నానం చేయడం మంచిది.
పైన చెప్పినన్ని కూడా మనం చేయగలిగేవే. ఈ విధంగా చేస్తే ఈ సమ్మర్ వీలైనంత కూల్ సాగిపోతుంది. మీరంతా పైన చెప్పినవన్నీ పాటిస్తూ సమ్మర్ ను కూల్ గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. మరీ సమ్మర్ ను ఎంజాయ్ చేయడానికి మీరు రెడీనా..
cool summer
Reviewed by Tollywood
on
March 05, 2019
Rating:
Reviewed by Tollywood
on
March 05, 2019
Rating:



No comments: