నయనానందం కోసం ఇవీ పాటించండి..
మనిషి శరీరంలో కంటికి ఉన్న ప్రాధాన్యం వెలకట్టలేనిది. మనం ఏ పని చేయాలన్న మార్గనిర్దేశం చేసేవీ మన కళ్లే. అలాంటి కళ్ల ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాం? అంటే ఏం సమాధానం ఉండదు. కంటిచూపు తగ్గితే అప్పటికప్పుడు డాక్టర్ ను సంప్రదించి మందులను వాడటం తప్ప ఇంకేమీ చేయలేం.
ఊరుకుల..పరుగుల జీవితంలో మనిషి తన గురించి తాను కూడా పట్టించుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఇక మన శరీరంలోని అవయవాల గురించి పట్టింపు అంతంత మాత్రమే.
కళ్లకు సంబంధించి రెండు రకాల దృష్టి లోపాలు ఉంటాయి. కొంతమందికి దగ్గర ఉండేవి కనిపించవు. మరికొందరికి దూరంగా ఉండేవి కనిపించవు. వీటినే లాంగ్ సైట్(long-sighted), షార్ట్ సైట్(short-sighted) అంటారు. కళ్లకు సరైన ఆహారం అందకపోవడం వల్లనే ఇలాంటి వస్తుంటాయి. ఇందుకోసంరోజూ మీరు తీసుకునే ఆహారంలో ఈ కింది డైట్ ఉండేలా చూసుకోండి. కంటిచూపు తగ్గకముందే నేను చెప్పే ఈ పంచసూత్రాలను పాటించి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ కళ్లకు నయనానందాన్ని పంచండి.
 |
ishwarya rai eyes is best
|
 |
palakura
|
- పాలకూర: పాలకూరను ఆహారంగా తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ కళ్లను కాపాడుకునేందుకు పాలకూరను మన డైట్లో తీసుకోవడం తప్పనిసరి. పాలకూరలోని ఔషధ విలువల గురించే తెలిస్తే ప్రతిఒక్కరూ పాలకూరను ఇష్టంగా తీసుకుంటారు. పాలకూరలోని విటమన్ ఏ(vitamin-A) కనుపాపలోని కార్నియా(cornea rings) రక్షిస్తాయి. పాలకూరలోని లూటిన్ అనే క్యరటీనైన్ కళ్లను అతినీలాలోహిత కిరణాల నుంచి కాపాడుతాయి. అలాగే పాలకూరలోని జియాక్సిన్ అనే రసాయనం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలకూర రసాన్ని తీసుకుంటే చాలామంచిది. ఒకవేళ అలా తీసుకోనట్లయితే మన డైట్లో వేపుళ్లు, కూరలు, పులుసుగా తీసుకోవడం మంచిది.
 |
salmon fish
|
- సాలమాన్ చేపలు: చేపలు కళ్లు మూసుకొని నిద్రపోయినా అవి మన కంటికి చేసే మేలు చేస్తాయి. సాలమాన్ చేపల్లోని పోషక పదార్థాలు కంటిలోని రెటీనా(retina)ను కాపాడుతుంది. ఈ చేపల్లో ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుగా ఉంటాయి. ఇవి కంటిలోని తేమను రక్షిస్తూ కళ్లకు మచ్చలు రాకుండా రక్షిస్తాయి. వారంలో కనీసం రెండుసార్లయినా డైట్లో తీసుకోవడం మంచిది. సాలమాన్ చేపలే కాకుండా బయట మార్కెట్లో దొరికే చేపలు కూడా కంటికి మేలు చేస్తాయి. కాకపోతే సాలమాన్ చేపల్లో కంటికి సంబంధించిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
 |
carrot
|
- క్యారెట్ : క్యారెట్లో విటమిన్-ఏ పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం కళ్లకు మంచిది. క్యారెట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రేచీకటి రాకుండా నివారించవచ్చు. కంటిలోని కార్నియాను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుతుంది. క్యారెట్లోని లూటెన్ అతినీలాలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. క్యారెట్లో లభించే పోటాషియం, పీచు పదార్థాలు కంటి నరాలు బలంగా ఉండేలా కాపాడుతాయి. క్యారెట్ ను మనం పచ్చిగా లేదా రోజువారీ ఆహారంతో తీసుకోవచ్చు.
 |
sweet potato
|
- చిలగడ దుంపలు(కందగడ్డ): చిలగడ దుంపల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫక్షన్ కళ్లకు రాకుండా కాపాడుతాయి. ఇవి దృష్టి సూక్ష్మతను పెంచుతాయి. వీటిలో పోటాషియం, పీచు, బీటా క్యారటెన్లు ఎక్కువుగా ఉండటం వల్ల చూపు స్పష్టత పెరగడంలో దోహదపడుతాయి. వీటిని తినడం వల్ల కళ్లలో శుక్లాలు, మచ్చలు రాకుండా రక్షిస్తాయి. కనుపాపకు బలాన్ని ఇస్తాయి. వీటిని మనం వేగించుకోని లేదా ఉడికుంచేకొని తినచ్చు.
 |
miriyalu
|
- మిర్యాలు: మిర్యాలలో విటమిన్ ఏ, సీలు అత్యధికంగా ఉంటాయి. ఇవి కంటిచూపును కాపాడి కంటిలో శుక్లాలు రాకుండా కాపాడుతాయి. బీ-6, బీటా క్యారటైన్, లైకోఫైన్, లూటైన్, తదితర పోషకాలు ఉండటం వల్ల వీటిని కళ్లకు జనరల్ డాక్టర్ అంటారు. అందుకే మన పూర్వీకులు మనం తీసుకునే ప్రతి ఆహారంలో మిర్యాలను చేర్చారు. వీటిని మనం అన్నిరకాల ఆహారాలతోపాటు, సీట్లలో, చిరుతిళ్లలో తీసుకోవచ్చు. ఇవి చూడటానికి చిన్నగా ఉన్న చిన్నచిన్న వస్తువులను చూడానికి మన కళ్లకు ఎంతో శక్తినిస్తాయి.
ఈ ఆహార పదార్థాలను ఆహారం తీసుకోవడంతో కంప్యూటర్, మొబైల్, టీవీ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించండి. కళ్లకు ఇబ్బంది కలుగనంత వరకు మాత్రమే వీటిని ఉపయోగించండి. వీటితో కళ్లకు సంబంధించిన ఎక్సర్ సైజులు చేస్తే మన కళ్లకు నయనానందాన్ని పంచవచ్చు. మన కంటిని కాపాడుకోవడం మనదే బాధ్యత. ఇది ఎవరి పనో అన్నట్లు చూడకుండా రోజువారీ ఆహారంలో పైన చెప్పిన డైట్(diet) తీసుకోని కళ్లను రక్షించుకుందాం.
No comments: