Sidebar Ads

banner image
banner image

ice apple(తాటిముంజ)


తాటిముంజలతో వేసవి తాపానికి చెక్ పెట్టండి..


వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు తాటిముంజలను మించిది లేదు. భానుడి ప్రతాపం నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన వరం తాటిముంజలని చెప్పడంలో అతిశయోక్తి లేదమో.. వేసవిలో తాటిముంజలను తినడం వల్ల మన శరీరం ఎండకు చెమట రూపంలో కోల్పోయిన లవణాలను తిరిగి పొందటంతోపాటు అధిక పోషకాలను శరీరానికి అందించవచ్చు. తద్వారా వేసవి ఉపశమనం నుంచి రక్షించుకోవచ్చు.

ice apple(తాటిముంజ)


తాటిముంజలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. తెలంగాణలో తాటిముంజలను ముంజకాయలని, ఆంధ్రప్రదేశ్ లో తాటిముంజలని, తమిళనాడులో నంగు అని, కన్నడలో తాటినంగు, పశ్చిమ బెంగాల్లో తాల్(taal), ఇంగ్లీషులో ((ice apple) అని అంటారు.

palm tree

తాటిముంజలను వేసవిలో తినడం వల్ల శరీరానికి నిజాలు, చక్కెర యొక్క పరిపూర్ణత, సంతులతలను అందింస్తుంది. తాటి పండులో పోటాషియం, పాస్పరస్, ఇనుము, కాల్షియం, జింకు, పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, బీ, సీ అధికంగా ఉంటాయి. రుచి తాజా కొబ్బరి మాదిరిగా ఉంటుంది.
  • వికారం, వాంతులు: వేసవిలో తరుచూ వికారం, వాంతులవుతున్నా లేక వికారంగా
    అనిపించినా తాటిపండు తినడం వల్ల దీని నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • అమ్మవారు(chiken poks): అమ్మవారు లేదా చికెన్ పాక్స్ ఉన్నవారు తాటిముంజలను తినడం ఎంతో మంచిది. దీని వల్ల శరీరంలో వేడి తగ్గడంతోపాటు దురద బాధకూడ తగ్గుతుంది.

chicken pox





  •  వడదెబ్బ: రోజువారీ ఆహారంతో తాటిముంజలను తీసుకోవడం ఎంతో అవసరం. దీనిలో నీటి నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరం నీటి స్థాయి పడిపోకుండా కాపాడుతుంది. తాటిముంజల్లో పోటాషియం అధికంగా ఉండటం వల్ల కాలేయ సమస్యలు తగ్గుతాయి. రొమ్ము క్యాన్సర్ నివారణకు శక్తివంతంగా పనిచేస్తాయి. 
  • గర్భధారణ సమయంలో: గర్భధారణ సమయంలో మహిళలకు అజీర్ణం, మలబద్ధకం,

    pregnancy

    ఎసీడీటీ వంటివి కలుగుతూ ఉంటాయి. ఈ సమయంలో తాటిముంజలను తినడం వల్ల వీటిని అదుపులో ఉంచుకోవచ్చు. ఉదారానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
  • డీహైడ్రేషన్: తాటిముంజల్లో నీటిశాతం ఎక్కువగా ఉన్నందున మీ శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. శరీరంలో గ్లూకోజ్ ప్రమాణాలను పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

  • కడుపునొప్పి: తాటిముంజలు సాధారణంగానే జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. వీటిని తినడం వల్ల కడుపునొప్పి వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియలో ఏర్పడే సమస్యలను నయం చేస్తుంది.

  • అలసట: వేసవిలో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. శరీరంలోని నీరు బయటికి పోవడంతో శరీరం శక్తిని కొల్పోతుంది. శరీరం తక్షణ శక్తిని పొందేందుకు తాటిముంజలు దోహదపడుతాయి.
  • మలబద్ధకం: వేసవిలో మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు తాటిముంజలు సహాయపడుతాయి. కందగల పండును తీసుకోవడం ఇష్టం లేకపోతే రసంలా చేసి పరగడుపున తీసుకుంటే మంచిది. 
ఇన్ని పోషకాలు కలిగిన తాటిముంజలను సమ్మర్లో కుమ్మేద్దమా మరీ. ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ కానీ, ప్రకృతి సిద్ధంగా లభించే ఏకైక పండు ఏదైనా ఉందంటే అది ఒక్క తాటి పండు మాత్రమే. రేటు కూడా  ఈ సీజన్లో దొరికే పండ్లతో పొలిస్తే అందుబాటు ధరలో ఉంటుంది. కావున ఈ సమ్మర్లో ప్రతీరోజూ తాటిముంజలను లాగించేద్దాం.
ice apple(తాటిముంజ) ice apple(తాటిముంజ) Reviewed by Tollywood on March 08, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.