Sidebar Ads

banner image
banner image

tsicet-2019 notification

టీఎస్ ఐసెట్-2019 నోటిఫికేషన్ విడుదల


టీఎస్ ఐసెట్-2019 నోటిఫికేషన్ విడుదలయింది. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం2019-20 విద్యా సంవత్సరానికి టీఎస్ ఐసెట్-2019 ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశాలను కల్పించనుంది. 

అర్హత: డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
ఫీజు వివరాలు: రూ.650 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ఆన్ లైన్, టీఎస్ ఆన్ లైన్ సెంటర్లలో చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్లో చేసుకోవాలి. మార్చి 11 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 3నాటికి ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు.

పరీక్షా విధానం: 200 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. 200 మార్కుల్లో 75  ప్రశ్నలు అనలిటికల్ ఎబిలిటీ, 75 ప్రశ్నలు మ్యాథమెటికల్ ఎబిలిటీ, 50ప్రశ్నలు కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. పరీక్షా సమయం 150నిమిషాలు(గంటన్నర). 

పరీక్ష నిర్వహించే తేదీలు: మే 23, 24

మే 23న ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు
మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5గంటలవరకు
మే 24న ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు ఉంటుంది.

click here https://icet.ac.in/


tsicet-2019 notification tsicet-2019 notification Reviewed by Tollywood on March 10, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.