Sidebar Ads

banner image
banner image

NICOTIN


నికోటిన్ ప్యాచెస్ తో జ్ఞాపకశక్తి పెరుగుదల!


ధూమపానం చేయాలనే కోరికను తగ్గించుకునేందుకు నికోటిన్ ప్యాచెస్ ముఖ్యంగా వాడుతుంటారు. అయితే ఈ నికోటిన్ ప్యాచెస్ ను వాడటం వల్ల దూమపానం చేయాలనే కోరిక తగ్గడంతోపాటు జ్ఞాపక శక్తి మెరుగువుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడయింది. అమెరికాకు చెందిన అధ్యయానికి బృందానికి నేతృత్వం వహిస్తున్న పాల్ న్యూస్ హౌజ్ ఈ విషయాన్ని ప్రకటించింది.

nicotine patches




జ్ఞాపక శక్తి లోపంతో ఇబ్బందిపడుతున్న వృద్ధుల్లో అనేకమంది అల్జీమర్స్ లక్షణాలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారందరూ నికోటిన్ ప్యాచెస్ వాడటం వల్ల జ్ఞాపకశక్తి లోపాన్ని, అల్జీమర్స్ లక్షణాలు తగ్గించుకునే అవకాశం ఉందని తేలిందట. సుమారు 70ఏళ్ల పైబడి వయస్సున్న, పొగతాగే అలవాటులేని 75మందిపై అధ్యయనం చేశారు. నికోటిన్ ప్యాచెస్ వినియోగించిన ఆరు మాసాల్లో వీరిలో ఫలితం కనిపించిందని అధ్యాయనం బృందం ప్రకటించింది.


జ్ఞాపకశక్తి లోపంతో ఇబ్బందిపడుతున్న 50శాతం మందిలో మెరుగైన ఫలితాలు కనిపించినట్లు అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న పాల్ న్యూస్ హౌజ్ పేర్కొంది. ఈ  అధ్యయనం వల్ల నికోటిన్ ప్యాచెస్ వినియోగం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఏదిఏమైనా నికోటిన్ ప్యాచెస్ వల్ల ధుమాపానం చేయాలనే కోరిక తగ్గడంతోపాటు జ్ఞాపక శక్తి వృద్ధి చెందటం సంతోషించదగినదే.   

NICOTIN NICOTIN Reviewed by Tollywood on March 18, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.